కోవిడ్ నిబంధనలు పాటించని జూనియర్ కాలేజీల పై చర్యలు – ఇంటర్ బోర్డు

సెప్టెంబర్ – 01 – 2021 నుండి కరోనా కారణంగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP)ని అమలు చేస్తూ అన్ని జూనియర్ కాలేజీలలోని భౌతికంగా తరగతులు ప్రారంభించిన విషయం తెలిసిందే.

ఈ విషయంలో కొన్ని కళాశాలలు తరగతులను నిర్వహిస్తున్నప్పుడు COVID నిబంధనలను పాటించడం లేదని ఆరోపణలు వచ్చాయని… కావునా అన్ని జూనియర్ కాలేజీల యాజమాన్యాలు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు, పరిశుభ్రతను పాటించాలని సూచించడం జరిగింది.

ఇంకా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ట్యూషన్ ఫీజు మాత్రమేవసూలు చేయాలని మరియు జూనియర్ కాలేజీలలో తగినంత మంది టీచింగ్ & నాన్ టీచింగ్ స్టాఫ్‌ని నియమించుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. లేకుంటే గుర్తింపు రద్దు తో పాటు కఠినమైన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు..

పై అంశాలపై జిల్లా ఇంటర్విద్యా అధికారులందరూ అన్ని జూనియర్ కళాశాలలలో పరిశుభ్రతను పర్యవేక్షించి, బోర్డు కు నివేదికను సమర్పించాలని ఆదేశించారు.