ప్రభుత్వానికి కృతజ్ఞతలు – జేఏసీ చైర్మన్ కనకచంద్రం

కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ పై ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 16 పై నిరుద్యోగులు వేసిన పిల్ నంబర్ 122 ను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో 711 సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కనకచంద్రం, ప్రధాన కార్యదర్శి శేఖర్, రాష్ట్ర నాయకులు జిల్లా నరసింహ హర్షం వ్యక్తం చేశారు.

ఈ కేసు కొట్టివేతకు తీవ్రంగా కృషి చేసిన కనకచంద్రం, శేఖర్ లకు కాంట్రాక్టు అధ్యాపకుల తరపున జిల్లా నరసింహ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ఇందుకు సహకరించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, కాంట్రాక్టు లెక్చరర్ ల గౌరవ అధ్యక్షుడు, రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు గారికి లాయర్ మధుసూదన్ రావ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ జేఏసీ చైర్మైన్ సీహెచ్ కనకచంద్రం ఒక ప్రకటన విడుదల చేసారు.

మున్ముందు క్రమబద్ధీకరణ కొరకు ప్రభుత్వం తో చర్చించి తగు చర్యలు వెంటనే తీసుకునేలా సంఘం తరపున కృషి చేస్తానని కనకచంద్రం తెలిపారు.

ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ కనకచంద్రం, శేఖర్, త్రిభువనేశ్వర్, జిల్లా నరసింహ, కడారి శ్రీనివాస్, మాలతి, సిద్దారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.