హైకోర్టు తీర్పు కాంట్రాక్టు ఉద్యోగులకు వెలుగు రేఖ – ఎండీ రహీమ్

కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ కొరకు విడుదల చేసిన జీవో నంబర్ – 16 పై వేసిన పిల్ పు ఈ రోజు హైకోర్టు కొట్టివేయడం పట్ల కాంట్రాక్టు అధ్యాపకుల మైనారిటీ సంఘం హర్షం వ్యక్తం చేసింది.

ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ. రహీమ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ మిన్హాజ్ ఉల్ హక్, వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్లా లు మాట్లాడుతూ సహకరించిన ప్రభుత్వ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఈ తీర్పు కాంట్రాక్టు ఉద్యోగుల జీవితాలకు వెలుగు రేఖ అని తెలిపారు.

ప్రభుత్వం వెంటనే జీవో నంబర్16 ను అమలు పరిచి కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరణ చేయాలని కోరారు.