క్రమబద్ధీకరణ తీర్పు పట్ల హర్షం – 711 సంఘం హేమచందర్ రెడ్డి

కాంట్రాక్ట్ లెక్చరర్స్ రెగ్యులరైజేషన్ వ్యతిరేకంగా కొందరు కుట్రపూరితంగా నిరుద్యోగుల పేరుతో వేసి నటువంటి పిటిషన్ ఈరోజు న్యాయస్థానం కొట్టి వేసిన సందర్భంగా మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు సూర్యాపేట 711 జిల్లా సంఘం పక్షాన మారం హేమచందర్ రెడ్డి తెలిపారు

మా సర్వీసును క్రమబద్దీకరించి మా జీవితాల్లో వెలుగులు నింపాలని తెలంగాణ ప్రభుత్వ కళాశాల కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ 711 రాష్ట్ర అధ్యక్షుడు కనక చంద్రం మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శేఖర్ ల నిరంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి మరియు ఆర్థిక మంత్రి హరీష్ రావు దృష్టికి అదేవిధంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ల దృష్టికి మరియు అధికారుల దృష్టికి సమస్యలు తీసుకెళ్తూ తీవ్ర కృషి అనంతరం ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు హరీష్ రావు లు ప్రత్యేక దృష్టి సారించడం మూలంగా ప్రభుత్వం తరఫున కూడా కౌంటర్ ఫైల్ వేయడం ముఖ్యంగా ఈ రోజు న్యాయస్థానంలో కాంట్రాక్ట్ అధ్యాపకులకు అనుకూలంగా రెగ్యులరైజేషన్ జీవో నెంబర్ 16 కు వ్యతిరేఖంగా నిరుద్యోగులు వేసిన కోర్టు ఈరోజు కొట్టివేయడం జరిగిందని తెలిపారు.

తీవ్ర నిరాశా నిస్పృహల్లో ఉన్న కాంట్రాక్టు అధ్యాపక లోకానికి శుభపరిణామం తెలుపుతూ గత 20 సంవత్సరాలుగా జీతాలు వచ్చినా రాకున్నా నెలలతరబడి ఆలస్యమైన నిజాయితీగా నిబద్ధతతో అంకితభావంతో విద్యార్థులకు బోధన అందించి ఉత్తమ ఫలితాలు సాధించి కళాశాలల్లో అడ్మిషన్ల సంఖ్యను గణనీయంగా పెరగడానికి కృషి చేసిన కాంట్రాక్ట్ అధ్యాపకులకు భగవంతుడు ఇచ్చిన వరంగా భావిస్తున్నామని సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు మారం హేమచందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వనపర్తి శ్రీనివాస్ తదితరులు హర్షం వ్యక్తం చేస్తూ ఈ కేసు కోర్టు ఈ కేసును కొట్టివేయాలని నిరంతరం న్యాయస్థానాల్లో పోరాటం చేసిన రాష్ట్ర అధ్యక్షుడు కనక చంద్రంకి మరియు జనరల్ సెక్రటరీ శేఖర్ లకు సహకరించిన ఇంటర్ విద్యార్థి జేఏసీ చైర్మన్ డాక్టర్ మధుసూదన్ రెడ్డికి మరియు న్యాయవాద బృందానికి ప్రత్యేక ధన్యవాదాలను సూర్యాపేట జిల్లా సంఘం పక్షాన తెలియజేస్తున్నామని హేమచందర్ రెడ్డి తెలిపారు.