బాబాసాహెబ్ అంబేద్కర్ సేవలు మరువలేనివి

  • విద్యార్థులందరూ అంబేద్కర్ చూపిన మార్గంలో నడవాలి
  • ప్రభుత్వ జూనియర్ బాలుర కళాశాల ప్రిన్సిపాల్ నాయిని వీరేందర్

మహబూబాబాద్ : భారత దేశానికి భారతరత్న డా,, బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన సేవలు మరువలేనివని మహబూబాబాద్ ప్రభుత్వ జూనియర్ బాలుర కళాశాల ప్రిన్సిపాల్ నాయిని వీరేందర్ అన్నారు. సోమవారం నాడు అంబేద్కర్ 65 వ వర్ధంతి ని పురస్కరించుకుని కళాశాల ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి కళాశాల ప్రిన్సిపాల్, మరియు అధ్యాపక బృందం తో కలిసి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా కార్యక్రమానికి అతిథులుగా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు కామ సంజీవరావు, బహుజన వాదులు తప్పెట్ల వీరన్న, వెంకన్న తదితరులు హాజరై విద్యార్థులకు సందేశం అందించారు.. బాబా సాహెబ్ ని ఆదర్శంగా తీసుకుని సన్మార్గంలో నడవాలని సూచించారు.

ప్రిన్సిపాల్ నాయిని వీరేందర్ మాట్లాడుతూ.. ప్రపంచ మేధావులలో డా,, బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకరని, అలాంటి వారి జీవితం అందరికీ ఆదర్శవంతమని, బాబాసాహెబ్ ఎన్నో జాతులని బానిసత్వం నుండి విముక్తి చేశారని, తన జీవితాన్నే భారతీయుల సేవ కు అంకితం చేశాడని కొనియాడారు. కళాశాల ఏజీఎంసీ అధికారి గుండమల్ల మధు మాట్లాడుతూ.. భారతదేశంలోని అణగారిన వర్గాలకు అక్షర జ్యోతి లా వెలుగందించిన మహనీయుడు అంబేద్కర్ అన్నారు. అంబేద్కర్ చెప్పినట్లుగా ఎలాంటి ఉన్నత స్థానానికి చేసుకోవాలన్నా చదువొక్కటే మార్గమని, మహనీయుల జీవితాలని ప్రతీ విద్యార్థి తెలుసుకుని వారిని ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు.

DOWN LOAD BIKKI NEWS app Now for more updates

ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ దార్ల భాస్కర్, అధ్యాపకులు ఎ. సరిత, పి. రాజేందర్, ఎన్. నాగిరెడ్డి, ఎం. డీ షాహిద్, కే. సారయ్య, ఎన్. సురేందర్, అయేషా అతహర్, ఆండాలు, సుశీల, వై నారాయణ, కె బాలరాజు, తిరుపతి, సుధాకర్, విద్యార్థినీ, విధ్యార్థులు పాల్గొన్నారు.