కాంట్రాక్ట్ లెక్చరర్లకు స్థానికత అప్షన్స్ అవకాశం కల్పించాలి : 475 అసోసియేషన్

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ మరియు జూనియర్ కళాశాలలో పని చేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లకు వారి స్థానికత ప్రకారం కొత్త జిల్లాలకు వెళ్లే అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖర రావు ఈరోజు ఆన్లైన్ లో వినతిపత్రం పంపించినట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాశాల కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ (TSGCCLA _ 475) రాష్ట్ర అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు జి .రమణారెడ్డి, డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ లు తెలిపారు.

జీవో నంబర్ 124 ప్రకారం పాత ఉమ్మడి పది జిల్లాలను ఏడు జోన్లుగా, రెండు మల్టీ జోన్స్ గా మార్చారని, గత 20 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ లెక్చరర్లు వివిధ కారణాల రీత్యా వివిధ జిల్లాల్లో పనిచేస్తున్నారని, భవిష్యత్తులో వీరికి, వీరి పిల్లలకు విద్యాభ్యాసానికి ఇబ్బందులు గురికాకుండా, వారి స్థానికత ఆధారంగా కొత్త జిల్లాలకు వెళ్లి అవకాశం కల్పించాలని కోరారు. వీరికి సొంత జిల్లాలో వెళ్ళటానికి ఆప్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు.

download BIKKI NEWS APP now

గత 13 సంవత్సరాలుగా బదిలీలు లేక కాంట్రాక్ట్ లెక్చరర్లు అనేక శారీరక, మానసిక, ఆర్థిక, ఇబ్బందులు పడుతున్నారని, గతంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం బదిలీలు నిర్వహించి, కాంట్రాక్ట్ లెక్చరర్లకు న్యాయం చేయాలని కోరారు.ఈ వినతి పత్రాన్ని ఆన్లైన్లో ఆర్థిక శాఖ మాత్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు, మరియు విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రా రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేష్ కుమార్, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, ఇంటర్ కమిషనర్, డిగ్రీ కమిషనర్ గలకు పంపించినట్లు తెలిపారు.