NSS ఆధ్వర్యంలో డా.బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతి వేడుకలు


హుస్నాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలుర)లో సోమవారం రోజున జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో డా. బి. ఆర్.అంబేద్కర్ 65వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ఏ దేవస్వామి మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, ఆయన చేసిన సేవలను కొనియాడుతూ, అతని ఆశయాలను ప్రజల్లోకి బలంగా తీసుకోని వెళ్ళుటకు విద్యార్థులు ముందుండాలని సూచించారు.

అలాగే కళాశాల జాతీయ సేవా పథకం ప్రోగ్రామ్ అధికారి టీ. రణధీర్ కుమార్ మాట్లాడుతూ NSS వాలంటీర్స్ అంబేద్కర్ ఆదర్శంగా తీసుకోని సమాజ సేవలో ముందుకు సాగుతూ, సమాజంను చైతన్య పరుస్తూ, శాస్త్రీయ దృక్పధం పెంపొందేలా కృషి చేయాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డా. యస్.యస్. రాజు, ఎస్ సత్యనారాయణ , దేవరాజు, విద్యాసాగర్ , ఎల్లయ్య, రమేష్, రజనీ, వెంకటముత్యం, సదాశివ, వాల్యా , స్వామి, మమత గ్రందపాలకుడు యమ్. చంద్రశేఖర్, ఆఫీస్ సిబ్బంది సంపత్, నాగరాజు, ఎల్లయ మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.