కొడిమ్యాల ప్రభుత్వ కళాశాలలో అంబేద్కర్ వర్దంతి కార్యక్రమం

కొడిమ్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం రోజున జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో డా. బి. ఆర్.అంబేద్కర్ 65వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ఎం. సంజీవయ్య డా. బి. ఆర్. అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యొక్క కృషిని కొనియాడుతూ, అతని ఆశయాలను ప్రజల్లోకి బలంగా తీసుకోని వెళ్ళుటకు విద్యార్థులు ముందుండాలని సూచించారు.

అలాగే కళాశాల జాతీయ సేవా పథకం ప్రోగ్రామ్ అధికారి డా. పి. తిరుపతి మాట్లాడుతూ NSS వాలంటీర్స్ అంబేద్కర్ ని ఆదర్శంగా తీసుకోని సమాజ సేవలో ముందుకు సాగుతూ, సమాజంను చైతన్య పరుస్తూ, శాస్త్రీయ దృక్పధం పెంపొందేలా కృషి చేయాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ఇందుర, నర్సయ్య, బాలకృష్ణరెడ్డి, ప్రభాకర్, జయపాల్ రెడ్డి, భాస్కర్, సుమన్, జయశీల, అనిల్ కుమార్, బాలాజీ సింగ్, ప్రవీణ్ కుమార్, ఆఫీస్ సిబ్బంది బి.రవీందర్, సుజాత మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.