ప్రభుత్వ బాలికల కళాశాల హుస్నాబాద్ లో అంబేద్కర్ వర్దంతి కార్యక్రమం


ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల హుస్నాబాద్ వారు జాతీయ సేవా పథకం యూనిట్ ఆధ్వర్యంలో డా. బి.ఆర్.అంబేద్కర్ 65వ వర్దంతి దినోత్సవ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ మరియు .ఎన్.ఎన్. ఎస్ చైర్మన్ నల్ల రామచంద్రారెడ్డి అధ్యక్షత వహించడం జరిగింది.

ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం కళాశాల ఎన్. ఎన్. ఎస్.చైర్మన్ నల్ల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రపంచం గర్వించదగ్గ వ్యక్తి అంబేద్కర్ అని గుర్తు చేస్తు రాజ్యాంగ రచనలో అంబేద్కర్ పాత్రను వివరించారు.

అలాగే ఎన్. ఎన్. ఎస్ ప్రోగ్రాం అధికారి కరుణాకర్ మాట్లాడుతూ నేడు భారతదేశంలోని అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు దక్కాయంటే అది అంబెడ్కర్ రచించిన రాజ్యాంగం కారణామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందము ఈ. సతమ్మ, పి.వరుధిని, డి.రవీందర్,శ బి.లక్ష్మయ్య, ఏస్. సదానందం, ఎస్.కవిత, కె.స్వరూప, జి.కవిత, పి.రాజేంద్రప్రసాద్, టి.రాజు,అధ్యాపకేతర బృందం,సీనియర్ అసిస్టెంట్ టి.పద్మ, జూనియర్ అసిస్టెంట్ గట్టవ్వ, రికార్డ్ అసిస్టెంట్ టి.భాగ్యాలక్మి, ఎన్. ఎన్.ఎస్.వాలంటీర్లు మరియు విద్యార్థినిలు పాల్గొన్నారు.