ఎయిడ్స్ వ్యాధి అవగాహన ర్యాలీ, సమావేశం

కొడిమ్యాల : ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం పురస్కరించుకొని బుధవారం రోజున జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వం జూనియర్ కళాశాలకు చెందిన జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో జూనియర్ కళాశాల ఆవరణం నుండి బస్టాండులోని డా. బి. ఆర్. అంబేద్కర్ విగ్రహం వరకు ఎయిడ్స్ వ్యాధి పై అవగాహన ర్యాలీ తీసి, మానవహారం నిర్వహించినారు.

తదుపరి కళాశాలలో జరిగిన ఎయిడ్స్ వ్యాధి అవగాహన సమావేశంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రిన్సిపాల్ ఎం. సంజీవ్ మాట్లాడుతూ ఎయిడ్స్ పట్ల ప్రతి ఒకరు అవగాహన కలిగి ఉండాలని, ఎయిడ్స్ వ్యాధికి ఎలాంటి మందు లేదని, నివారణ ఒకటే మార్గం అని సూచించారు.

అదేవిధంగా కళాశాల జాతీయ సేవా పథకం ప్రోగ్రామ్ అధికారి డా.పి. తిరుపతి మాట్లాడుతూ విద్యార్థులు వ్యాధులు పట్ల అప్రమత్తంగా ఉండాలని, అలాగే సురక్షితం కానీ శారీరక కలయిక వలన మరియు హాస్పిటల్ యందు సురక్షిత కానీ సిరంజిల వలన, సెలూన్ షాపుల యందు సురక్షితం కానీ బ్లేడుల వలన ఎయిడ్స్ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుందని, కావున విద్యార్థులు వాటి పట్ల నిర్లక్ష్యం వహించరాదని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ఇందుర, నర్సయ్య, బాలకృష్ణరెడ్డి, ప్రభాకర్, జయపాల్ రెడ్డి, భాస్కర్, సుమన్, జయశీల, అనిల్ కుమార్, బాలాజీ సింగ్, ప్రవీణ్ కుమార్, ఆఫీస్ సిబ్బంది, ఎన్.ఎన్.ఎస్ వాలంటీర్లు మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు