ప్రభుత్వ జూనియర్ కళాశాల జన్నారంలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ కార్యక్రమం

జన్నారం : ప్రభుత్వ జూనియర్ కళాశాల జన్నారం నందు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ప్రిన్సిపాల్ శరత్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులకు హెచ్ఐవి ఎయిడ్స్ పట్ల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శరత్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులందరూ హెచ్ఐవి ఎయిడ్స్ వంటి వ్యాధుల పట్ల అవగాహన ఉంది సమాజానికి అవగాహన కల్పించాలని అలాగే విద్యార్థులందరూ సన్మార్గంలో నడిచి మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని పిలుపునిచ్చారు

ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ విభాగం పి ఓ కరుణాకర్ అధ్యాపక బృందం దేవేందర్, మోహన్, రవీందర్, నాగేశ్వర్‌, కుమారస్వామి, స్వరూప మరియు విద్యార్థులు పాల్గొన్నారు.