ప్రభుత్వ జూ. కళాశాల హుస్నాబాద్ (బాలుర) లో ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం.

డిసెంబర్ -01 న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ జూనియర్ కళాశాల హుస్నాబాద్ (బాలుర) లో జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఎ. దేవస్వామి మాట్లాడుతూ ఈ వ్యాధికి చికిత్స లేదని నివారణ ఒక్కటే మార్గం అని పేర్కొన్నారు. సమాజంలో ఉన్న నేటి యువతీ యువకులు ఈ వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండాలని, ఈ వ్యాధి వంశపారంపర్యంగా రాదని, ఈ వ్యాధి సోకిన వారిని చిన్నచూపు చూడకుండా వారిని సైతం సమాజంలో వ్యక్తులుగానే గౌరవించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జాతీయ సేవా పథకం ప్రోగ్రాం అధికారి తిరునహరి రణధీర్ కుమార్, లైబ్రేరీయన్ చంద్రశేఖర్, అధ్యాపకులు విద్యాసాగర్, వెంకటముత్యం, సత్యనారాయణ, ఎల్లయ్య, దేవరాజు, రజనీ, ఎస్తేర్ రాణి, వాల్యా, సదాశివ్, రమేష్, స్వామి, మమత, సంపత్ పాల్గొన్నారు.