జాతీయసేవా పథకం ఆధ్వర్యంలో ఎయిడ్స్ అవగాహన ర్యాలీ


హుస్నాబాద్ : ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల హుస్నాబాద్ జాతీయ సేవా పథకం (N.S.S.)ఆధ్వర్యంలో హుస్నాబాద్ పురవీధుల గుండా ఎన్.ఏస్.ఏస్.వాలంటీర్స్ ప్లకార్డ్స్ మరియ నినాదాల ద్వారా ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన ర్యాలీని నిర్వహించారు.

అనంతరము వాలంటీర్లు మరియు విద్యార్ధినిలు మానవహారంగా ఏర్పడి ఎయిడ్స్ పై అవగాహన నినాదాలు చేశారు. ఈ ర్యాలీని ఉద్దేశించి కళాశాల N.S.S. చైర్మన్ మరియు కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ నల్ల రామచంద్రారెడ్డి మట్లాడుతూ ప్రజలందరూ ఎయిడ్స్ వ్యాధిపట్ల అవగాహన కలిగి వుండి ఎయిడ్స్ వ్యాధి కి దూరంగా ఉండాలన్నారు. ఎయిడ్స్ వ్యాధి నిర్మూలన పట్ల ప్రజలందరూ భాగస్వామ్యులు కావాలన్నారు.

ఈ కార్యక్రమము N.S.S.ప్రోగ్రామ్ అధికారి డి.కరుణాకర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమాలలో కళాశాల అధ్యాపకులు ఈ. సత్తమ్మ, డి.రవీందర్, పి.వరుధిని, సదానందం, బి.లక్ష్మయ్య, ఎస్.కవిత, కె.స్వరూప, జి.కవిత, పి.రాజేంద్రప్రసాద్, టి.రాజు అధ్యపకేతర బృందము సీనియర్ అసిస్టెంట్ టి.పద్మ, జూనియర్ అసిస్టెంట్ ఎన్. గట్టవ్వ ఎన్. ఎన్. ఎస్.వాలంటీర్స్ మరియు విద్యార్థినిలు పాల్గొన్నారు.