ఎయిడ్స్ డే సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల మెదక్ లో విద్యార్థులకు అవగాహన సదస్సు

మెదక్ :: ఎయిడ్స్ డే సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల మెదక్ లో ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డా. సుధాకర్ మాట్లాడుతూ ఎయిడ్స్ పట్ల విద్యార్థులందరూ అవగాహన పొంది.. సమాజానికి అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. సుధాకర్ , వైస్ ప్రిన్సిపాల్ డా.. దినకర్, అధ్యాపకులు వామనమూర్తి , వినోద్ కుమార్ , మహిళ సాధికారత విభాగం ఇంఛార్జి శ్రీమతి అరుణ కుమారి, వేణుశర్మ , రెడ్ గ్రీన్ క్లబ్ గంగాధర్ లు పాల్గొన్నారు.