ప్రజలలో అవగాహన పెంపుతోనే ఎయిడ్స్ వ్యాధి అంతం

  • ప్రభుత్వ జూనియర్ బాలుర కళాశాల ప్రిన్సిపాల్ నాయిని వీరేందర్
  • ఎన్ఎస్ఎస్ ఆద్వర్యంలో ఎయిడ్స్ వ్యాధి పై అవగాహన ర్యాలీ

మహబూబాబాద్: మహబూబాబాద్ ప్రభుత్వ జూనియర్ బాలుర కళాశాల జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) ఆద్వర్యంలో డిసెంబర్ 1 ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఎయిడ్స్ వ్యాధి పై అవగాహన ర్యాలీ ని కళాశాల ప్రిన్సిపాల్ నాయిని వీరేందర్ ప్రారంభించారు. ఈ ర్యాలీ కళాశాల ప్రాంగణం నుండి స్థానిక మథర్ థెరిసా సెంటర్ వరకు సాగింది. ర్యాలీలో విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు “ఎయిడ్స్ వ్యాధి ని నిర్మూలిద్దాం.. సమాజాన్ని కాపాడుకుందాం.., ఎయిడ్స్ కు మందు లేదు, నివారణ ఒక్కటే మార్గం” అంటూ నినాదాలు చేస్తూ.. ప్లకార్డులతో స్థానిక ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా.. ప్రిన్సిపాల్ నాయిని వీరేందర్ మాట్లాడుతూ.. ప్రజలలో అవగాహన పెంపుతోనే ఎయిడ్స్ వ్యాధి అంతం సాధ్యమవుతుందని, ఎయిడ్స్ అనే వ్యాధి సోకిన వారి పట్ల సమాజం వివక్షత చూపకుండా.. అవగాహన కల్పించి,అవసరమైన కోర్సులు వాడేలా చూడాలని కోరారు. ముఖ్యంగా యువత చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రతీ విధ్యార్థి పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు వారి స్థానిక ప్రాంతాలలో ఎయిడ్స్ వ్యాధి గూర్చి అందరికి అవగాహన కల్పించాలని తెలిపారు. ఎయిడ్స్ వ్యాధి అనేది అంటు వ్యాధి కాదని, వ్యాధి సోకిన వారు ప్రభుత్వం అందించే వైద్య సదుపాయాలను పొందాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ దార్ల భాస్కర్, కళాశాల ఏజీఎంసీ అధికారి గండమల్ల మధు, స్టాప్ సెక్రటరీ పెండ్లి అశోక్ కుమార్, అధ్యాపకులు ఎ. సరిత, పి. రాజేందర్, ఎన్. నాగిరెడ్డి, ఎం. డీ షాహిద్, కే. సారయ్య, ఎన్. అప్పారావు, ఎన్. సురేందర్, అయేషా అతహర్, ఆండాలు, సుశీల, వై నారాయణ, కె బాలరాజు, తిరుపతి, సుధాకర్, విద్యార్థినీ, విధ్యార్థులు పాల్గొన్నారు.