ఎయిడ్స్ పట్ల యువత అవగాహన పెంపొందించుకోవాలి.

  • ఎయిడ్స్ రహిత సమాజాన్ని తీర్చిదిద్దేందుకు కృషి చేయాలి.
  • జిల్లా మాస్ మీడియా అధికారి ఏం ప్రభాకర్

ఎయిడ్స్ మహమ్మారిని పూర్తి స్థాయి లో నిర్మూలించేందుకు సమాజంలో ప్రతీ ఒక్కరికీ అవగాహన కలిగేలా విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వ జూనియర్ కళాశాల కో ఎడ్యుకేషన్ దర్మకంచ జనగామ ఇంఛార్జి ప్రిన్సిపాల్ శతి నందినీ పటేల్ పిలుపునిచ్చారు.

డిసెంబర్ 1 న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ సేవా పథకం ఆధ్వర్యం లో కళాశాలలో బుధవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారు ఎయిడ్స్ పై అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా మాస్ మీడియా అధికారి ఎమ్.ప్రభాకర్ మాట్లాడుతూ ఇప్పటికీ తెలంగాణాలో లక్షా ముప్పై వేల మంది ఎయిడ్స్ వ్యాధి బారిన పడి ఇబ్బందులు ఎదుర్కుంటున్నారన్నారు. యువత ఎయిడ్స్ గురించి చర్చించుకుని తగు జాగ్రర్తలు పాటించాలని సూచించారు. వ్యాధి గ్రస్తులను అంటరాని వారిగా చూడరాదని తెలిపారు. వ్యాధికి మంధు లేదని,నివారణ ఒక్కటే మార్గమని తెలిపారు. జాతీయ సేవా పథకం వాలంటీర్స్ ఎయిడ్స్ వ్యాధి పట్ల, సుఖ వ్యాధుల పట్ల గ్రామ గ్రామాన ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

ఈ సందర్భంగా విధ్యార్థులకు ఎయిడ్స్ నివారణోపాయాలు అనే అంశం పై నిర్వహించిన వ్యాస రచన పోటీలలో విజేతలకు ప్రశంసా పత్రాలను అందజేశారు.

ఈ కార్యక్రమం లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గాలిబ్, రవి, జాతీయ సేవా పథకం ప్రోగ్రామ్ ఆఫీసర్స్ డాక్టర్ వస్కుల శ్రీనివాస్, మరిపెళ్ళి రవి ప్రసాద్, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.