విద్యార్థులు చెడు వ్యసనాలకు గురి కావొద్దు : ఇంటర్ విద్య ఆర్జేడి బి. జయప్రద

గార్ల :: ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా గార్ల ప్రభుత్వ జూనియర్ ప్రిన్సిపాల్ రూపం గోవింద రావు ఆధ్వర్యంలో కళాశాలలో విద్యార్థులు ర్యాలీని ఇంటర్ విద్య ఆర్జేడి బి. జయప్రద జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా జయప్రద మాట్లాడుతూ… విద్యార్థులు ఈ దశలో చెడు వ్యసనాలకు గురి కాకుండా తల్లిదండ్రులు, విద్యాసంస్థల పేరు నిలపాలని జీవితంలో మంచిగా గుర్తింపు తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే విద్యార్థి జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాలను ఎదుర్కొని నిలబడినప్పుడు భవిష్యత్తులో మంచి జీవితం లభిస్తుందని తెలుపుతూ తన జీవితంలో కూడా అనేక కష్టనష్టాలను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చానని తల్లిదండ్రులు మాట, గురువు మాట విని విద్యార్థులు క్రమశిక్షణతో నడుచుకుంటే మిగతా జీవితం మంచిగా జరుగుతుందని తెలిపారు.

అలాగే గార్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలకు కావలసిన ప్రహరీ గోడ గురించి మరియు అటెండర్ పోస్టు గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.

అధ్యాపకులు విద్యార్థులకు మంచి చేయటానికి నిరంతరం కృషి చేయాలని కోరారు. అనంతరం ఎన్.ఎస్.ఎస్. పి. ఓ. డాక్టర్ యు. శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా కళాశాల విద్యార్థులు ర్యాలీని రీజనల్ జాయింట్ డైరెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఆర్.గోవిందరావు, సీనియర్ అధ్యాపకులు రఘు బాబు, డాక్టర్ కొప్పిశెట్టి సురేష్, జోగ్యా నాయక్, వేముల రవీందర్ తోట నాగేశ్వరరావు, గొడుగు సోమన్న, జి రాంబాబు, ఏ. ప్రసాద్ రావు, జి సుజాత , ఏ. స్రవంతి, బీ. నాగశ్రీ, పి. నాగేశ్వరరావు, జీ. విమల, శంకర్ అధిక సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.