పరిస్థితులను బట్టి ఆన్లైన్ తరగతులు

ఇంజనీరింగ్, డిగ్రీ కళాశాలలో తప్పనిసరి పరిస్థితుల్లో ఆన్లైన్ బోధన దిశగా సమాయత్తమవ్వాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి భావిస్తోంది. విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్ లతో చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి భేటీ అయ్యారు.

కరోనా తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కళాశాలలో అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి కాలేజీలోనూ కరోనా సహాయ కేంద్రం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాల న్నారు. బోధన, బోధనేతర సిబ్బందిలో ఎంత మందికి వ్యాక్సినేషన్ జరిగిందనే వివరాలు పంపాలని వీసీలను కోరారు. కాలేజీల్లో ప్రత్యేకంగా క్యాంపులు నిర్వహించి విద్యార్థులు, సిబ్బందికి రెండు డోసుల వ్యాక్సినేషన్ జరిగేలా చూడాలని సూచించారు.

కరోనా కారణంగా గడచిన రెండేళ్లుగా ఆన్లైన్ విద్యాబోధనకే విద్యార్థులు అలవాటుపడ్డారు. ఈ నేపధ్యంలో ప్రత్యక్ష బోధనకు వస్తున్న విద్యార్థుల మానసిక స్థితిని అంచనా వేయాలని కోరారు. . వారి మానసిక స్థితిని మెరుగుపర్చేందుకు కాలేజీల్లో విధిగా మెంటార్స్ ను ఏర్పాటు చేయాలని, మెంటర్ నంబరు విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని చెప్పారు.

ఇప్పుడు BIKKK NEWS app ని డౌన్లోడ్ చేసుకుని వార్తలు చదవండి