భారత నావికాదళ 25వ అధిపతిగా అడ్మిరల్ ఆర్. హరికుమార్ బాధ్యతలు చేపట్టారు. అడ్మిరల్ కరమ్ బీర్ సింగ్ నుంచి మంగళవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా అడ్మిరల్ హరికుమార్ మాట్లాడుతూ.. భారత నూతన నావికాదళ అధిపతిగా బాధ్యతలు స్వీకరించడం ఒక అరుదైన గౌరవమని.. జాతీయ నౌకాదళ సవాళ్ల పై భారత నావికాదళం దృష్టి సారిస్తుందని స్పష్టంచేశారు. అంతకుముందు హరి కుమార్ వైస్ అడ్మిరల్ గా కొనసాగారు.