పాఠశాలలకు సెలవులంటూ ప్రచారం నమ్మవద్దు – సబితా ఇంద్రారెడ్డి

సోషల్ మీడియాలో పాఠశాలలకు సెలవు అంటూ వస్తున్న ప్రచారాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు నమ్మవద్దని తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన చేశారు.

కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యాసంస్థలను కొనసాగించాలని ఇటీవల జరిగిన మంత్రి మండలి సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.