చరిత్ర పరిరక్షణ ఉద్యమంకు సంపూర్ణ మద్దతు

కాకతీయ యూనివర్శిటీ చరిత్ర విభాగంకు చెందిన రెగ్యులర్, కాంట్రాక్ట్ మరియు పార్ట్ టైమ్ అధ్యాపకులు చరిత్ర పరిరక్షణ ఉద్యమంకు సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లు తెలంగాణ చరిత్ర పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు డా. తిరుపతి పోతరవేణి ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా మంగళవారం రోజున చరిత్ర విభాగం సెమినార్ హల్ లో యందు జరిగిన సమావేశంలో డా. పి. సదానందం చరిత్ర విభాగాధిపతి మాట్లాడుతూ జూనియర్, డిగ్రీ కళాశాల విద్యా భోధనలో చరిత్రను పాఠ్యంశంను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని పేర్కొన్నారు.

ప్రొ. కే. విజయబాబు, చరిత్ర విభాగం బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ మాట్లాడుతూ మన చరిత్ర – సంస్కృతిని సంరక్షించి, భావి తరాలకు అందించాలంటే చరిత్రను కాలేజీ స్థాయి విద్య బోధనలో తప్పనిసరి సబ్జెక్టు చెయ్యాలని పేర్కొన్నారు.

సీనియర్ ఫ్యాకల్టీ ప్రో. తాళ్ళపల్లి మనోహర్ మాట్లాడుతూ ఆదునిక విధ్యావిదానంలో మానవీయ శాస్త్రమైన చరిత్ర సబ్జెక్టు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలసిన ఆవశ్యకత ఎంతో ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో డా. సందవేణి తిరుపతి, డా. వై. రాంబాబు, డా. డి. శంకర్, డా. ఎ. కుమారస్వామి, డా యం.కె. సుమంత్, డా. M. బ్రహ్మం, డా. కె.వి.యస్. నరేందర్, డా. నాగేశ్వరరావు, డా. టి. విజయ్ కుమార్, డా. పి. కృష్ణ మరియు పరిశోధక విధ్యార్థులు పాల్గొన్నారు.