జిల్లా స్థాయి పోటీలలో గొల్లపల్లి ప్రభుత్వ కళాశాల విద్యార్థుల ప్రతిభ

జగిత్యాల జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిభా పాటవ పోటీలలో గొల్లపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి బహుమతులు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఏనుగుల మల్లయ్య ఒక ప్రకటనలో తెలిపారు.

జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ( నల్సా) ఆదేశాల మేరకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ జగిత్యాల జిల్లా కోర్టు ప్రాంగణంలో “అవినీతి దాని ప్రభావము”, “ఆడ శిశువు హత్య – సమాజంపై దాని ప్రభావం”, “వరకట్నం ముప్పు”, “ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువ” తదితర అంశాలలో పోటీలు నిర్వహించారు. ఇందులో కళాశాల విద్యార్థులు ప్రథమ, ద్వితీయ మరియు ప్రోత్సాహక బహుమతులు పొందారు.

ఈ వ్యాసరచన పోటీలో అలిశెట్టి పవన్, ఏదునూరి రశ్మిత, మారంపల్లి ఆనంద్, శ్రీవిద్య, ఉపన్యాస పోటీలలో తోకల శృతి, మారం రమ్య, గాజుల సమీరా, రష్మిత బహుమతులు సాధించినట్లు ప్రిన్సిపాల్ తెలియజేశారు.

కళాశాల విద్యార్థులు జిల్లా స్థాయిలో బహుమతులు సాధించడం పట్ల కళాశాల లెక్చరర్లు కాశెట్టి తిరుపతి, రేమిడి మల్లారెడ్డి, వెంకట కృష్ణారెడ్డి, తిరుపతి రెడ్డి, ప్రసాద్, బాలరాజు, తిరుపతి, రాజకుమార్, నాగలక్ష్మి, సునీత, శ్రీనివాస్, రాంప్రసాద్ మరియు విద్యార్థులు అభినందనలు తెలిపారు.