TS RJC CET – 21 రద్దు

తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన‌ సాంఘిక సంక్షేమ ఇంట‌ర్ క‌ళాశాల‌ల ప్ర‌వేశ ప‌రీక్ష‌(TS RJC CET 2021)ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ఆ శాఖ కార్యదర్శి ఆర్ఎస్ ప్ర‌వీణ్‌కుమార్ వెల్ల‌డించారు.

కోవిడ్ వ్యాప్తి కారణంగా ఈ విద్యా సంవత్సరానికి గాను నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వివ‌రించారు. రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ప్రవేశాలు ప‌దో త‌ర‌గ‌తి గ్రేడ్ల ఆధారంగా ఉంటాయ‌ని స్ప‌ష్టం చేశారు.

ఆస‌క్తి ఉన్న విద్యార్థులు ఈనెల 7వ తేదీ లోపు మార్కుల‌ను కింది వెబ్సైట్ లో అప్లోడ్ చేయాల‌ని సూచించారు.

పూర్తి వివ‌రాలు కోసం

వెబ్సైట్ :: www.tswreis.in