ఇంటర్మీడియట్ పరీక్షలను రద్దు చేయాలి – TIPS & TIGLA

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు రద్దు చేయవలసిందిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు విద్యాశాఖ మంత్రికి “తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి” (TIPS) & తెలంగాణ ఇంటర్మీడియట్ గవర్నమెంట్ లెక్చరర్స్ అసోసియేషన్ (TIGLA) తరపున విజ్ఞప్తి చేస్తున్నాం.

ప్రస్తుత COVID-19 సెకండ్ వేవ్ రూపంలో తీవ్రంగా విస్తరిస్తున్న అత్యవసర పరిస్థితులలో దేశవ్యాప్తంగా CBSE -XII తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగిందని, ఈ నేపథ్యంలో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ దృష్ట్యా, ప్రస్తుత సున్నితమైన పరిస్థితుల దృష్ట్యా వారిలో మానసిక వత్తిడి తగ్గించడానికి, తల్లిదండ్రులలో మరియు ఉద్యోగులలో ఆందోళన తొలిగించడానికి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను రద్దు చేయాలని పేర్కొన్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించి, మూల్యాంకనం చేసి, పరీక్ష ఫలితాలను సరైన పద్దతులలో ప్రకటించే పరిస్థితులు లేవని ఈ పరిస్థితులను పరిగణలోనికి తీసుకొని తక్షణమే ఇంటర్ పబ్లిక్ పరీక్షలు రద్దు చేయాలని విజ్ఞప్తి చేస్తూన్నామని TIPS & TIGLA తరపున జంగయ్య, రామకృష్ణ గౌడ్ ఒక ప్రకటన లో ప్రభుత్వానికి విన్నవించారు.