జూన్ 1వ తేదీన ప్రారంభం కావాల్సిన ఇంటర్ ఆన్లైన్ తరగతులు వాయిదా పడ్డాయి. సవరించిన షెడ్యూల్ను సాయంత్రం లోపు విడుదల చేస్తామని ఇంటర్ బోర్డు ప్రకటించింది.
ఏటా జూన్ 1 నుంచే ఇంటర్ కాలేజీలు ప్రారంభవుతుండగా, గతేడాది కరోనా నేపథ్యంలో సెప్టెంబర్ నుంచి ఆన్లైన్ క్లాసులను ప్రారంభించారు.
ఈ ఏడాది విద్యార్థులు నష్టపోకుండా జూన్ 1 నుంచే ఆన్లైన్ క్లాసులను ప్రారంభించాలని ఇటీవలే ఇంటర్ బోర్డు నిర్ణయించిన సంగతి తెలిసిందే. కానీ లాక్డౌన్ పొడిగింపు నేపథ్యంలో ఆన్లైన్ క్లాసులు వాయిదా పడ్డాయి.
ఇప్పటికే నూతన విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించిన నేపథ్యంలో జూనియర్ కళాశాలకు టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది హాజరు విషయంలో ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు.