తెలంగాణ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కళాశాలలో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్ ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు జూన్ 3వ తేదీ వరకు పొడిగిస్తూ ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ నిర్ణయం తీసుకున్నారు.
జూన్ 3వ తేదీ వరకు ఎలాంటి ఆలస్య లేకుండానే దరఖాస్తు చేసుకోవచ్చని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇప్పటివరకు 2,01,367 మంది విద్యార్థులు ఎంసెట్ ఎంట్రన్స్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు.