కరోనా సెకండ్ వేవ్ విపత్కర సమయంలో జూనియర్ డాక్టర్లు (జూడాలు) సమ్మెకు పిలుపునివ్వడం సరికాదని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రజారోగ్య దృష్ట్యా తక్షణమే విధుల్లో చేరాలని జూడాలకు సీఎం సూచించారు.
జూడాల పట్ల ప్రభుత్వం ఏనాడూ వివక్ష చూపలేదని స్పష్టం చేశారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సమయ, సందర్భాలు చూడకుండా విధులను బహిష్కరించడం సరికాదు. జూనియర్ వైద్యుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఎం అధికారులను ఆదేశించారు. సీనియర్ రెసిడెంట్లకు ఇచ్చే గౌరవ వేతం 15 శాతం పెంచాలని నిర్ణయించారు. ఇదే వేతనాన్ని జూడాలకు కూడా అమలు చేయాలని ఆదేశించారు.