దేశ వ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే JEE అడ్వాన్స్డ్ పరీక్షలు మరోసారి కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. ఈ మేరకు ఐఐటీ ఖరగ్పూర్ అధికారికంగా వెల్లడించింది.
జులై 3వ తేదీన నిర్వహించాల్సిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను కరోనా పరిస్థితులు అదుపులోకి వచ్చిన తర్వాత పరీక్ష నిర్వహణ తేదీలను వెల్లడిస్తామని చెప్పింది. అడ్వాన్స్డ్ పరీక్షను వాయిదా వేస్తూ గత నెలలో ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు మరోసారి వాయిదా పడింది.
ఇక ఏప్రిల్, మే నెలలో జరగాల్సిన జేఈఈ మెయిన్ పరీక్షలు కూడా వాయిదా పడ్డ విషయం తెలిసిందే. సెకండ్ వేవ్ నేపథ్యంలోనే మెయిన్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రకటించింది.