తెలంగాణ రాష్ట్రం లో ప్రథమ సంవత్సరం ఇంటర్మీడియట్ ప్రవేశాలకు షెడ్యూల్ విడుదలైంది. ఈ రోజు నుంచి జులై 5వ తేదీ వరకు ప్రవేశాలకు అనుమతిని ఇస్తున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది.
జూన్ 1 నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం ఆన్లైన్ తరగతులు ప్రారంభం కానున్నాయి. పదవ తరగతి ఇంటర్నెట్ మార్కుల మెమోల ఆధారంగా ప్రాథమిక ప్రవేశాలు చేసుకోవాల్సిందిగా కళాశాలల ప్రిన్సిపాళ్లకు ఇంటర్‌బోర్డు సూచించింది. అనంతరం ఎస్ఎస్సీ పాస్ సర్టిఫికేట్, టీసీ, స్టడీ సర్టిఫికెట్ల ఆధారంగా ప్రవేశాలను ధ్రువీకరించాలని పేర్కొంది.

