టెన్త్, ఇంటర్ ఓపెన్ పరీక్షల పీజు గడువు పెంపు

పదవ మరియు ఇంటర్మీడియట్ తరగతి ఓపెన్ స్కూల్ విద్యార్థులు (TOSS) 50 రూపాయల అపరాధ రుసుముతో పరీక్ష ఫీజు చెల్లింపు తేదీ మే నెల 31వ తేదీ వరకు పెంచుతూ తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.

పరీక్ష ఫీజును కేవలం TS ONLINE మరియు మీ సేవా కేంద్రాల ద్వారా మాత్రమే చెల్లించాలని ఒక ప్రకటనలో తెలిపారు.

పదవ మరియు ఇంటర్మీడియట్ తరగతి ఓపెన్ స్కూల్ పరీక్షలు జూలై నెలలో జరిగే అవకాశం ఉంది.