పదవ తరగతి విద్యార్థులకు ఆగస్టులో ఒరిజినల్ మార్కుల మెమోలు ఇస్తామని అప్పటివరకు వెబ్సైట్లో అందుబాటులో ఉంచిన మెమోలను డౌన్లోడ్ చేసుకొని వినియోగించుకోవచ్చని విద్యాశాఖ అధికారులు సూచించారు.
నకిలీ, బోగస్ మెమోలను అరికట్టడంలో భాగంగా బార్‌కోడ్‌తో పాటు మరికొన్ని సెక్యూరిటీ ఫీచర్లను మెమోల మీద ముద్రిస్తున్నారు. కొన్ని కారణాలతో ఎస్సెస్సీ మెమోల్లో పేర్లు, ఇంటిపేరు, తల్లిదండ్రుల పేర్లల్లో తప్పులు, ఇతర తప్పులు చోటుచేసుకొంటున్నాయని అందుకే ఆలస్యమైనా తప్పులు లేకుండా మెమోలు అందజేయాలని అధికారులు నిర్ణయించారు.
ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఆగస్టు మొదటివారంలో మెమోలు అందజేస్తామని అధికారులు చెప్తున్నారు. పాఠశాల లాగిన్ ఐడీ నుంచి ప్రింట్ తీసి ప్రధానోపాధ్యాయులు సంతకం చేసిన మెమోలను ప్రస్తుతానికి వినియోగించుకోవచ్చని అధికార వర్గాలు తెలిపాయి.