2020 విశ్వసుందరి ఎవరు.?

2020 సంవత్సరానికి గాను విశ్వసుందరి (మిస్‌ యూనివర్స్‌) కిరీటాన్ని మెక్సికో భామ ఆండ్రియా మెజా గెలిచారు. విశ్వసుందరి కిరీటాన్ని దక్కించుకున్న మూడో మెక్సికన్‌గా నిలిచారు.

మిస్‌ యూనివర్స్‌ 69వ ఎడిషన్‌లో మొత్తం 74 దేశాలకు చెందిన సుందరాంగులు పోటీ పడగా ఆండ్రియా మెజా విజేతగా నిలిచారు. అమెరికాలోని హాలీవుడ్‌లో ఉన్న సెమినోల్‌ హార్డ్‌రాక్‌ హోటల్,క్యాసినోలో విశ్వ సుందరి పోటీలు జరిగాయి.

పోటీల్లో విజేతగా నిలిచిన 26 ఏళ్ల మెజాకు 2019 విశ్వసుందరి జోజిబినీ టూన్జీ మిస్‌ యూనివర్స్‌ కిరీటాన్ని అలంకరించారు. మెజా తర్వాతరెండో స్థానంలో బ్రెజిల్‌ యువతి జూలియా గామా(28), మూడో స్థానంలో పెరూ యువతి జనిక్‌ మాసెటా(27), నాలుగో స్థానంలో భారతీయ యువతి, మిస్‌ ఇండియా అడ్‌లైన్‌ కాస్టెలినో(22)నిలిచారు.