కోవిడ్ నిర్ధారణ పరీక్షను (ర్యాపిడ్ టెస్ట్) ఇంటి వద్దే చేసుకునే విధంగా ఎట్-హోం కోవిడ్ టెస్టింగ్ కిట్ ‘కొవిసెల్ఫ్’కు ICMR అనుమతించింది. ఈ ర్యాపిడ్ టెస్ట్ కిట్‌ను పుణెలోని మైల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ సంస్థ ఈ కిట్‌ను తయారు చేసింది.
ఒక్కో కిట్ ధర రూ. 250 నిర్ణయించినట్లు ICMR డీజీ బలరామ్ భార్గవ్ వెల్లడించారు. ఎట్-హోం కోవిడ్ టెస్టింగ్ కిట్ల రాకతో టెస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
దీని ద్వారా కొవిడ్ లక్షణాలున్న వ్యక్తలు స్వయంగా కిట్‌ను వినియోగించి ముక్కు ద్వారా నమూనాలు సేకరించి పరీక్ష చేసుకోవచ్చు.
● ఎలా ఉపయోగించాలి ::
ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ కిట్‌ను వినియోగించేందుకు మొబైల్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. దాని ద్వారా పాజిటివ్, నెగెటివ్ రిపోర్టును అందుకోవచ్చు. ఇంట్లో టెస్ట్ చేసుకునే వారు తమ ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్న యాప్ నుంచి టెస్ట్ స్ట్రిప్ ఫొటో తీసి, అప్లోడ్ చేయాలి. ఈ డేటా నేరుగా ఐసీఎంఆర్ కరోనా టెస్ట్ పోర్టల్‌లో సేవ్ అవుతుంది. ఈ విధానంలో టెస్టు చేసుకున్న తర్వాత మరో టెస్టు అవసరం లేదు.
మైలాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ తయారు చేసిన ఈ కిట్ మరో వారంలో మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. దీని ధర సుమారు రూ.250 వరకు ఉంటుందని అంచనా. పరీక్ష ఫలితాలు ఐదు నుంచి నిమిషాలు నుండి గరిష్ఠంగా 15 నిమిషాలు పరీక్ష ఫలితాలు తెలుస్తాయని కంపెనీ పేర్కొంది.