గాంధీ హస్పిటల్ ని సందర్శించిన కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సికింద్రాబాద్‌ లోని గాంధీ హస్పిటల్ ను ఈ రోజు మంత్రి హరీశ్‌రావు, సీఎస్‌ సోమేశ్ కుమార్‌తో కలిసి సందర్శించడం జరిగింది. హస్పిటల్ లోని కొవిడ్‌ చికిత్సలు, ఇతర సదుపాయాలను ఆయన పరిశీలించారు.

కరోనా ఎమర్జెన్సీ వార్డు, ఓపీ వార్డులను కేసీఆర్‌ సందర్శించారు. ఐసీయూలో ఉన్న రోగులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. అనంతరం అక్కడి జూనియర్‌ వైద్యులు, ఇతర సిబ్బందిని సీఎం అభినందించారు.

గాంధీ హస్పిటల్ లో ఆక్సిజన్‌ వసతి, ఔషధాల సరఫరా తదితర అంశాలపై అక్కడి వైద్యులతో కేసీఆర్‌ మాట్లాడారు. ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటుపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. సుమారు 40 నిమిషాలపాటు సీఎం గాంధీ ఆస్పత్రి పర్యటన కొనసాగింది.