“బర్డే ట్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మబ్బు కాన్షీరాం జన్మదిన వేడుకలు”

మబ్బు కాన్షీరాం జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని జనగామ జిల్లా ,లింగాల ఘణపుర్ మండలం ,కళ్లెం గ్రామంలో బర్త్డే ట్రీ ఫౌండేషన్ అధ్యక్షుడు మబ్బు కరుణాకర్ ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది.

ఈ సందర్భంగా బర్త్డే ట్రీ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి నక్కీర్త మహేష్ మాట్లాడుతూ ఆయువు లేనిదే మనిషే లేడు ఆయువు ను ఇచ్చేది పచ్చని మొక్క అని తెలుపుతూ మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.
జన్మదిన సందర్భంగా ఇతర కార్యక్రమాలు చేపట్టకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా వాతావరణ కాలుష్యం తగ్గించడం కోసం మొక్కలు నాటే ఇంత మంచి కార్యక్రమాన్ని అందరూ చేపట్టాలని అన్నారు.
ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరు మాస్కు ధరించి భౌతిక దూరం పాటిస్తూ,శానిటీజర్ ఉపయోగించాలని అన్నారు.


ఈ కార్యక్రమంలో ట్రీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మబ్బు పరశురాం,అంబేద్కర్ యువజన సంఘం కోశాధికారి శ్రీధర్,తిప్పారపు భాస్కర్,ప్రశాంత్,చింటు,ప్రిన్సీ తదితరులు పాల్గొన్నారు.