తెలంగాణ లాక్ డౌన్ గైడ్ లైన్స్

పది రోజుల పాటు లాక్‌డౌన్‌ విధిస్తూ తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మే 12వ తేదీ నుంచి 22 వరకూ ఈ లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో మూడు గంటల పాటు జరిగిన కేబినెట్‌ భేటీలో లాక్‌డౌన్‌ సహా అనేక అంశాలపై చర్చించి, మార్గదర్శకాలను విడుదల చేశారు.

లాక్ డౌన్ ఉత్తర్వులు pdf file

తెలంగాణ కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాలు..

  • మే 12వ తేదీ బుధవారం ఉదయం 10 గంటల నుంచి.. 10 రోజులపాటు లాక్ డౌన్ అమలులో ఉంటుంది..
  • ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ప్రజల అవసరాల కోసం సడలింపు. * కేవలం 4 గంటలపాటు మాత్రమే అన్నిరకాల షాపులు తెరిచి ఉంటాయి. మిగతా 20 గంటలపాటు లాక్‌డౌన్‌.
  • మే 20న కేబినెట్‌ తిరిగి సమావేశం అవుతుంది. లాక్‌డౌన్ కొనసాగించే విషయంపై సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకుంటారు.
  • యుద్ధ ప్రాతిపదికన.. వ్యాక్సిన్ ప్రొక్యూర్‌మెంట్ కోసం గ్లోబల్ టెండర్లు.
  • ప్రభుత్వ రంగంతోపాటు, ప్రైవేట్ రంగంలో కూడా రెమిడిసివిర్ ఇంజక్షన్లు, ఆక్సిజన్, ఇతర కరోనా మందులను అందుబాటులోకి తీసుకురావడం. వీటి కొరత రాకుండా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ ఆదేశాలు.
  • అన్ని జిల్లాల్లో మంత్రుల అధ్యక్షతన కలెక్టర్, డీఎంహెచ్ఓ, జిల్లా కేంద్రంలోని దవాఖానా సూపరింటెండెంట్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్లతో కమిటీ వేయాలని నిర్ణయం.
  • ప్రతిరోజూ ఆయా జిల్లాల మంత్రులు వారి వారి జిల్లా కేంద్రాల్లో కరోనాపై సమీక్ష చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశం.

★ లాక్ డౌన్ నుంచి మినహాయింపు కల్పించిన రంగాలు

  • వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించిన పనులు, అనుబంధ రంగాలు, వ్యవసాయ యంత్రాల పనులు, రైస్ మిల్లుల నిర్వహణ, సంబంధిత రవాణా, ఎఫ్.సి.ఐ.కి ధాన్యం పంపడం, ఫెర్టిలైజర్, సీడ్ షాపులు, విత్తన తయారీ కర్మాగారాలు తదితర అన్నిరకాల వ్యవసాయ రంగాలకు లాక్ డౌన్ వర్తించదు.
  • తెలంగాణ రాష్ట్ర రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ధాన్యం కొనుగోళ్లను యథావిధిగా కొనసాగింపు.
  • వైద్య రంగంలో ఫార్మాస్యూటికల్ కంపెనీలు, వైద్య పరికరాల తయారీ కంపెనీలు, మెడికల్ డిస్ట్రిబ్యూటర్లు, మెడికల్ షాపులు, అన్నిరకాల వైద్య సేవలు, ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలు, వారి వారి ఉద్యోగులు, సిబ్బందికి ప్రత్యేక పాసులిచ్చి, వాహనాలకు అనుమతి.
  • గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ యథావిధిగా కొనసాగింపు.
  • విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థలు, వాటి అనుబంధ కార్యకలాపాలు యథావిధిగా పనిచేస్తాయి.
  • జాతీయ రహదారుల మీద రవాణా, పెట్రోల్, డీజిల్ పంపులు నిరంతరం తెరిచే ఉంటాయి.
  • కోల్డ్ స్టోరేజీ, వేర్ హౌసింగ్ కార్యకలాపాలకు మినహాయింపు
  • ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు మినహాయింపు
  • ఉపాధిహామీ పనులు యథావిధిగా కొనసాగుతాయి.
  • ప్రభుత్వ కార్యాలయాలు 33శాతం సిబ్బందితో పనిచేస్తాయి.
  • గత లాక్ డౌన్ సమయంలో మాదిరిగానే బ్యాంకులు, ఏటీఎంలు యథావిధిగా పనిచేస్తాయి.
  • అన్ని ముందస్తు అనుమతులతో జరిపే పెళ్లిళ్లకు గరిష్టంగా 40 మందికి మాత్రమే అనుమతి
  • అంత్యక్రియల సందర్భంలో గరిష్టంగా 20 మందికి మాత్రమే అనుమతి.
  • తెలంగాణ చుట్టూ.. రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్ పోస్టుల ఏర్పాటుకు నిర్ణయం
  • ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అన్నిరకాల మెట్రో, ఆర్టీసీ ప్రజా రవాణా అందుబాటులో ఉంటుంది.
  • ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు రేషన్ షాపులు తెరిచే ఉంటాయి.

Credits :: EENADU