తెలంగాణ @ లాక్ డౌన్

తెలంగాణలో లాక్‌డౌన్‌ విధిస్తూ రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణ‌యం తీసుకుంది. బుధవారం (12 మే 2021) నుంచి ప‌దిరోజుల పాటు అనగా మే 21 వరకు ఈ లాక్‌డౌన్‌ కొన‌సాగ‌నుంది.

ప్ర‌తిరోజు ఉద‌యం 6 గంట‌ల నుంచి 10 గంట‌ల వ‌ర‌కు మాత్రం లాక్‌డౌన్‌ నుంచి మిన‌హాయింపు ఇచ్చారు. నిత్య‌వ‌స‌రాలు, ఇత‌ర వ‌స్తువుల కొనుగోలుకు ఈ స‌మ‌యంలో వెసులుబాటు క‌ల్పించారు. ఉద‌యం 10 గంట‌ల నుంచి మ‌రుస‌టి రోజు ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు లాక్‌డౌన్ అమ‌లు కానుంది.

ఈ స‌మ‌యంలో దాదాపు అన్ని కార్య‌క‌లాపాలు నిలిచిపోనున్నాయి. అత్య‌వ‌స‌ర సేవ‌ల‌ను మాత్ర‌మే అనుమ‌తించ‌నున్నారు.