కోవిడ్ 19 చికిత్సలో ఐవర్‌మెక్టిన్‌ డ్రగ్ ను వాడవద్దు – W.H.O.

కోవిడ్ 19 చికిత్సలో యాంటీ వైరల్ డ్రగ్ అయినా ఐవర్‌మెక్టిన్‌ను పేషంట్ లకు వాడవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చ‌రించింది. ఈ మేర‌కు WHO చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్‌ ట్వీట్ చేశారు. ఏదైనా కొత్త వ్యాధికి వాడే మెడిసిన్‌కు కచ్చితమైన భద్రత, సమర్థత చాలా ముఖ్యమ‌ని పేర్కొన్నారు. క్లినికల్ ట్రయల్స్‌లో తప్ప కొవిడ్ చికిత్సలో ఐవర్‌మెక్టిన్‌ను ఉపయోగించవద్దని సూచించారు.

యాంటీ వైర‌ల్ డ్ర‌గ్ ఐవ‌ర్‌మెక్టిన్ క‌రోనా చికిత్సలో సమర్థంగా పనిచేస్తుందని, మరణం ముప్పును కూడా గణనీయంగా తగ్గిస్తుందని ఆమెరికా జర్నల్ ఆఫ్ థెరప్యూటిక్స్‌ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. అందుకే గోవా ప్రభుత్వం రాష్ట్రంలో 18 ఏండ్లు దాటిన వారందరికీ ఐవర్‌మెక్టిన్‌ మాత్రలను పంపిణీ చేస్తామని సోమవారం ఒక ప్రకట‌నలో పేర్కొన్న‌ది. ఈ నేపథ్యంలో WHO ఐవ‌ర్ మెక్టిన్‌ను వాడొద్ద‌ని హెచ్చ‌రించింది.