విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సందీప్ కుమార్ సుల్తానియా

విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామచంద్రన్‌ (1985వ బ్యాచ్‌) శుక్రవారం పదవీ విరమణ పొందారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చిత్రారామచంద్రన్‌ కృష్ణా జిల్లా కలెక్టర్‌గా పని చేయడంతోపాటు వివిధ శాఖల్లో, కేంద్ర సర్వీసు విభాగాల్లో బాధ్యతలు నిర్వర్తించారు.

పదవీ విరమణ పొందిన ఆమె స్థానంలో పంచాయతీ రాజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియాకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శిగా ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది.