ఎమ్మెల్సీ సురభి వాణీ దేవిని మర్యాదపూర్వకంగా కలిసిన డా.పి. మధుసూదన్ రెడ్డి బృందం

తెలంగాణ ఇంటర్ విద్య జె.ఏ.సి. ఛైర్మన్ డా. పి. మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో నేడు బేగంపేటలోని శ్రీ రామనంద తీర్థ మెమోరియల్ ట్రస్ట్ సురభి ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్ నందు నూతన శాసనమండలి సభ్యులు
శ్రీమతి సురభి వాణీ దేవిని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ విద్య ప్రారంభించి 50 వసంతాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని స్వర్ణోత్సవ వేడుకలు చేసుకుంటున్న వేళ మాజీ ప్రధాని పి.వి నరసింహారావు శత వసంతోత్సవాలు జరుపుకునే వేళ
వారి విజయోత్సవం ఆనందదాయకమని.. ఈ గెలుపులో కీలక పాత్ర వహించిన ఇంటర్ విద్య జె.ఏ.సి ని ప్రత్యేకంగా డా.పి.మధుసూదన్ రెడ్డిని అభినందించారు.

స్వదేశంలో IIT ల్లో 40% తెలుగు విద్యార్థులు చదవటానికి,
విదేశాల్లో సిలికాన్ వ్యాలీలో అత్యధికంగా మనవారు ఉండటానికి కారణమైన ఇంటర్మీడియట్ విద్యను
మన రాష్ట్రంలో ప్రారంభించి, దేశంలో విద్య కోసం ప్రత్యేకంగా మానవ వనరుల శాఖను ఎర్పాటు చేసిన పి.వి నరసింహ రావు దూరదృష్టిని దిశా నిర్దేశాల్ని గుర్తుకు తెచ్చుకోవడం ఆనందందాయకమని తెలిపారు.

ఒక విద్యావేత్తగా రాబోయే రోజుల్లో నాన్న చూపిన బాటలో
విద్యా వ్యవస్థ బలోపేతానికి కలిసి మెలిసి ముందుకు సాగుదామని సురభి వాణి దేవి అభిలాషించారు.

నేటి ఈ ఆత్మీయ సమూహంలో కళింగ కృష్ణకుమార్, విజయ శేఖర్ ,శ్రీమతి రాణి, శ్రీమతి రజిత, శ్రీమతి కవిత కిరణ్, శ్రీమతి సునీత, శ్రీమతి పద్మావతి, పాల్గొన్నారు.