నైతికత మరియు పర్యావరణ ఎసైన్మెంట్ల సమర్పణకు గడువు పెంపు

కరోనా కారణంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులు ఇంటి వద్దే అసైన్మెంట్ రూపంలో రాయవలసిన పర్యావరణ విద్య, మరియు నైతికత మానవ విలువలు పరీక్షల అసైన్మెంట్ లను విద్యార్థులు కళాశాల లో సమర్పించవలసిన గడువును ఎప్రిల్ 30వ తేదీ వరకు పెంచుతూ ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయం తీసుకుంది.

గతంలో ప్రకటించినట్లుగా ఎప్రిల్ 20వ తేదీతో ఈ గడువు ముగిసిన విషయం తెలిసిందే. విద్యార్థులు అసైన్మెంట్ లను నేరుగా కళాశాలకు గాని, రిజిస్టర్ పోస్టు ద్వారా గాని, పిడిఎఫ్ ఫైల్ రూపంలో కళాశాల మెయిల్ కు పంపించే అవకాశం కలదు.

సంబంధించిన మార్కులను కాలేజ్ లాగిన్ లో సమర్పించడానికి చివరి తేదీ మే – 03 వరకు కలదు.