కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్గా (CEC) సుశీల్ చంద్ర ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. 24వ సీఈసీగా సుశీల్ చంద్రను నియమిస్తూ సోమవారం కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2022 మే 14 వరకు సీఈసీగా సుశీల్ చంద్ర పదవిలో కొనసాగుతారు. ప్రస్తుత సీఈసీ సునీల్ అరోరా సోమవారం పదవీ విరమణ చేశారు.
సుశీల్ చంద్ర సారథ్యంలో గోవా,మణిపూర్, ఉత్తరాఖండ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల కమిషనర్గా నియమితులు కాకమునుపు సీబీడీటీ చైర్మన్గా ఆయన వ్యవహరించారు.