CBSE పరీక్షలను రద్దు చేయండి -కేజ్రీవాల్

దేశంలో కరోనా విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో CBSE 10, 12వ తరగతి పరీక్షలను రద్దు చేయాలని డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. డిల్లీలో 6లక్షల మంది CBSE పరీక్షలు రాయాల్సి ఉందని, ఈ పరీక్షలు నిర్వహిస్తే పరీక్షా కేంద్రాలు కొవిడ్‌ హాట్‌స్పాట్లుగా మారే ప్రమాదం ఉందన్నారు. ప్రత్యామ్నాయం అంటే ఆన్లైన్‌ ద్వారా పరీక్షలు నిర్వహించాలని కేంద్రానికి సూచించారు.

CBSE 10,12వ తరగతి పరీక్షలు మే 4 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలలో దాదాపు 6లక్షల మంది విద్యార్థులు, లక్షమంది సిబ్బంది పాల్గొంటారని, ఈ సమయంలో విద్యార్థులు, టీచర్లకు కొవిడ్‌ సోకే ప్రమాదం ఉందన్నారు.

దేశ రాజధాని డిల్లీలో గడిచిన 24గంటల్లో 13,500 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం డిల్లీలో కరోనా నాలుగో ఉద్ధృతి కొనసాగుతోందని, మునుపటి విజృంభణ కంటే ఇది ప్రమాదకరమైందని అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు.