ఐపీఎల్ – 2021 ఉత్కంఠ పోరులో రాజస్థాన్ పై పంజాబ్ గెలుపు

ఐపీఎల్ – 2021 లో ఈ రోజు పంజాబ్ మరియు రాజస్థాన్ జట్ల మద్య జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ సెంచరీ సాధించినప్పటికి ఓటమి చవిచూసింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు 6 వికెట్లు కోల్పోయి 221 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో కెప్టెన్ సంజూ శాంసన్ సెంచరీ నమోదు చేశాడు. చివరి బంతికి 5 పరగులు చేయాల్సిన సమయంలో క్యాచ్ ఔట్ కావడం ద్వారా 4 పరగుల తేడాతో ఓటమి పాలయ్యారు.

పంజాబ్ జట్టులో కెప్టెన్ రాహుల్ 91 పరగులు చేశాడు. దీపక్ హుడా 64 పరగులు చేశాడు.చేతన్ 3, మోరిస్ 2 వికెట్లు తీశారు.

చేజింగ్ లో రాజస్థాన్ జట్టు కెప్టెన్ శాంసన్ 119 పరుగులు చేసి చివరి బంతికి ఔట్ అయ్యాడు. 217 పరుగుల వద్దే ఆగిపోయారు. అర్షదీప్ 3, షమీ 2 వికెట్లు తీశారు.