భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన బ్రాడ్కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL)లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1679 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్ పోస్టులు ఉన్నాయి.
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు BECIL ట్రైనింగ్ కోర్సును నిర్వహిస్తుంది. దీనిని విజయవంతంగా పూర్తిచేసి.. ట్రైనింగ్ ప్రోగ్రామ్లో 50 శాతం మార్కులు సాధించిన వారిని వివిధ ప్రభుత్వ ప్రాజెక్టుల్లో కాంట్రాక్టు ప్రాతిప్రదికన నియమిస్తుంది.
● మొత్తం పోస్టులు :: 1679
● విభాగాలు :: ఎలక్ట్రిషన్, లైన్మెన్, ఎస్ఎస్ఓ, అసిస్టెంట్ లైన్మెన్ వంటి పోస్టులు ఉన్నాయి.
● అర్హతలు ::
- స్కిల్ పోస్టులకు సంబంధిత విభాగంలో ఐటీఐ చేసి ఉండాలి.
- అన్స్కిల్డ్ పోస్టులకు ఎనిమిదో తరగతి పాసై ఉండాలి
- సెమీ స్కిల్డ్ పోస్టులకు ఇంటర్ పాసై, ఇంగ్లిష్, హిందీలో టైపింగ్ చేయగలిగి ఉండాలి.
● దరఖాస్తు పద్దతి :: ఆన్లైన్లో
● అప్లికేషన్ ఫీజు :: 590/- ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు 295/-
● చివరితేదీ :: ఏప్రిల్ 20 – 2021
● వెబ్సైట్ :: http://www.beciljobs.com