ప్రభుత్వ జూనియర్ కళాశాల సిబ్బందికి ఒంటిపూట కళాశాలల నిర్వహించాలి – గాదె వెంకన్న

ప్రభుత్వ జూనియర్ కళాశాలల సిబ్బంది ఒంటిపూట కళాశాల నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని ఆర్జేడీ నియమిత కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు గాదె వెంకన్న, కుమార్ లు ఇంటర్విద్యా కమీషనర్ ఉమర్ జలీల్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగినది.

దీనిపై కమిషనర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఎండలు విపరీతంగా పెరగడం, కరోనా కేసులు తీవ్రంగా పెరగుతున్న నేపథ్యంలో కేవలం ఆన్లైన్ తరగతులు మానీటరింగ్ చేయడానికి కళాశాలకు వెళ్లడం ఇబ్బందిగా ఉందని ఆన్లైన్ తరగతులు ఇంటివద్ద నుండి కూడా చేసే అవకాశం కలదని కావునా ఒంటిపూట కళాశాలలకు అనుమతి ఇవ్వాలని కోరడం జరిగింది.

ఇదే విషయం మీద రేపు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డిని సంఘం తరపున కూడా కలిసి వినతిపత్రం ఇవ్వనున్నట్లు వెంకన్న ఒక ప్రకటనలో తెలిపారు.