ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు వాయిదా – ఇంటర్ బోర్డ్

కరోనా సెకండ్ వేవ్ కారణంగా తెలంగాణ రాష్ట్రంలోని జూనియర్ కళాశాల లు మూతబడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2021 ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ లో భాగంగా జరిగే ప్రాక్టికల్ పరీక్షలు ( జనరల్ & ఒకేషనల్) ఏప్రిల్ 7 నుంచి 20 వరకు జరగాల్సి ఉండగా వాటిని పబ్లిక్ పరీక్షల అనంతరం మే 29 నుండి జూన్ 07వ తారీకు వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.

ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు, బ్యాచ్ ల ఏర్పాటు, మరియు పరీక్షల షెడ్యూల్ ను తర్వాత ప్రకటిస్తామని ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది. మే 1 నుండి ఇంటర్మీడియట్ వార్షిక పబ్లిక్ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే.