30 శాతం ఫిట్మెంట్ ప్రకటించడంపై టిప్స్ హర్షం… కాంట్రాక్టు అధ్యాపకులకు బేసిస్ పే, డీఏ, హెచ్ఆర్ఏ కల్పించాలని వినతి

తెలంగాణ ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 30 శాతం పిట్మెంట్ తో పిఆర్సీ ప్రకటించడంపై తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి (TIPS) హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మరియు తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ను కలిసి TIPS నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా పీఆర్సీ అమలు పరచడం పై TIPS కన్వీనర్ జంగన్న, కో కన్వీనర్ రామకృష్ణ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. అలాగే జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు బేసిక్ పే తో పాటు డీఏ, హెచ్ ఆర్ ఏ కల్పించాలని TIPS నాయకులు మంత్రి శ్రీనివాస్ గౌడ్ మరియు బి వినోద్ కుమార్ కు వినతిపత్రం సమర్పించారు.

ఈ కార్యక్రమంలో టిప్స్ నాయకులు జంగయ్య, రామకృష్ణ గౌడ్, కొప్పిశెట్టి సురేష్, గాదె వెంకన్న, గోవర్ధన్ శోభన్ బాబు, శ్రీనివాస్ రెడ్డి, ఉదయశ్రీ, శైలజ, సంగీత, నూర్ అప్సానా, రమాదేవి, గాయత్రి, రమేష్, నాగరాజు, లక్పతి, గోవర్ధన్, పట్టాభి తదితరులు పాల్గొన్నారు