నైతికత – మానవ విలువలు & పర్యావరణ విద్య అసైన్మెంట్ పరీక్షల మార్గదర్శకాలు

తెలంగాణలోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు నైతికత – మానవ విలువలు మరియు పర్యావరణ విద్య బోర్డు పరీక్షలను కరోనా కారణంగా కళాశాలలు మూతపడటంతో ఇంటి వద్దే అసైన్మెంట్ రూపంలో వ్రాసి కళాశాలకు సమర్పించాలని ఇంటర్మీడియట్ బోర్డు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో నైతికత – మానవ విలువలు మరియు పర్యావరణ విద్య అసైన్మెంట్ పరీక్షలు విధివిధానాలు మీద మార్గదర్శకాలను ఈరోజు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేయనుంది.

  • నైతిక మరియు మానవ విలువలు పర్యావరణ విద్య పరీక్షలు అసైన్మెంట్ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది.
  • ప్రస్తుత సంవత్సరానికి 40 మార్కులకు ఉండే ప్రాజెక్ట్ వర్క్ లేదు.
  • బోర్డు నుండి జవాబు పత్రాలు ఇవ్వబడవు. విద్యార్థులు A4 సైజ్ పేపర్ లలో అసైన్మెంట్ పరీక్షలు వ్రాయలి.
  • 100 మార్కుల మోడల్ పేపర్లను ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్సైట్ లో పొందుపరిచారు.
  • కళాశాలలు సంబంధిత మోడల్ పేపర్లను డౌన్లోడ్ చేసుకుని తదనుగుణంగా 100 మార్కులకు ప్రశ్నా పత్రాలు తయారు చేసి విద్యార్థులకు ఇవ్వాలని సూచించారు.
  • అసైన్మెంట్ పరీక్ష రాసిన విద్యార్థులు జవాబు పత్రాలను నేరుగా కళాశాలలో గాని, రిజిస్టర్ పోస్టు ద్వారా గాని, పిడిఎఫ్ రూపంలో స్కాన్ చేసిన ఫైల్స్ ను మెయిల్ ద్వారా గాని ఎప్రిల్ – 20 తేదీ లోపల సమర్పించాలి.
  • అసైన్మెంట్ పరీక్షల జవాబు పత్రాల మీద హాల్ టికెట్ నెంబర్ ను కచ్చితంగా నమోదు చేయాల్సి ఉంటుంది.
  • విద్యార్థులు ఏప్రిల్ 1 నుండి కింద ఇవ్వబడిన ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్సైట్ లో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలి
  • అసైన్మెంట్ పరీక్షలలో విద్యార్థులకు వచ్చిన మార్కులను అధికారిక వెబ్సైట్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది

WEBSITE :: https://tsbie.cgg.gov.in/home.do