ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టిన తిసారా పెరీరా – వీడియో

శ్రీలంక ఆల్‌రౌండర్‌ తిసార పెరీరా ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టిన తొలి శ్రీలంక క్రికెటర్‌గా పెరీరా నిలిచాడు. లిస్ట్‌ ఏ క్రికెట్‌లో అతడు ఈ ఘనత అందుకున్నాడు. ఎస్‌ఎల్‌సీ మేజర్‌ క్లబ్‌ టోర్నమెంట్‌లో భాగంగా ఆర్మీ స్పోర్ట్స్‌ క్రికెట్‌ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తిసార పెరీరా ఆఫ్‌ స్పిన్నర్‌ దిల్హాన్‌ కూరే బౌలింగ్‌లో వరుసగా 6 సిక్సర్లు కొట్టాడు.

SIX SIXSE IN AN OVER BY THISARA PERERA VIDEO

అలాగే అతడు 13 బంతుల్లోనే 52 పరుగులు సాధించాడు. లిస్ట్‌-ఏ క్రికెట్‌లో రెండో అత్యంత వేగవంతమైన అర్ధశతకం ఇదే. 2005లో లంక ఆల్‌రౌండర్‌ కౌశల్య వీరరత్నె 12 బంతుల్లోనే హాఫ్‌సెంచరీ పూర్తి చేశాడు.